Water conservation: నీరు చాలా విలువైనది - నీటిని సంరక్షించుకుందాం

• జలమండలి DGM జె సరిత

On
Water conservation: నీరు చాలా విలువైనది - నీటిని సంరక్షించుకుందాం

సరూర్ నగర్, రాజముద్ర వెబ్ డెస్క్: నీరు చాలా విలువైనదని, చుక్క నీటిని సృష్టించలేము కనుక ఉన్న నీటిని సంరక్షించుకుందామని వాటర్ బోర్డు డీజీఎం జే. సరిత పేర్కొన్నారు. ఈ మేరకు సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాటర్ బోర్డ్ డీజీఎం జే సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నీరు చాలా విలువైనదని, వాటిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు.

 

ఒక్క నీటి చుక్కను కూడా మనం సృష్టించలేము కావున ప్రతి నీటి బిందువు మన ఆత్మ బంధువుగా భావించి ఆదా చేసుకోవాలన్నారు. వర్షపు  నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకించాలని తెలిపారు. అప్పుడే భూగర్భ జలం సమృద్ధిగా మనకు లభిస్తుందని అన్నారు.  నీరు సమస్త జీవకోటికి ప్రాణాధారం నీటిని వృధా చేయకూడదన్నారు. అనంతరం నీటిని రక్షించాలంటూ కరపత్రాలను పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ టి సురేందర్ జల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కరపత్రములు, బ్యానర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఏ నవీన్ కుమార్, శ్రీకాంత్, అరణజ్యోతి, మమత, రజిని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పిఈటి నవీన్ సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కోఆర్డినేటర్స్ ఎన్ జయ సూర్య,  టిఆర్సి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Latest News