World Water Day: సమస్త ప్రాణికోటికి నీరే ఆధారం 

• జల సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలి : డి బలరామరాజు జనరల్ మేనేజర్

On
World Water Day: సమస్త ప్రాణికోటికి నీరే ఆధారం 

World Water Day:  ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జలసంరక్షణ కోసం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా నందనవనంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ జనరల్ మేనేజర్ డి బలరామరాజు విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ నీటి దినోత్సవం లో భాగంగా సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వారు కాలనీలోని పాఠశాలల్లో జల సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకుడు గుంతలు వాటి నిర్వహణపై ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం మనకు నీటికి ఇబ్బందులు లేకపోయినప్పటికీ మున్ముందు నీటి కష్టాలు రాకుండా ముందు జాగ్రత్తగా మనందరం నీటిని వృధా చేయకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా భూగర్భ జలాల పెంపు కోసం విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. నిర్మించుకున్న వాటిని  సీజన్ తర్వాత మళ్లీ రెయిన్ సీజన్ ముందు వాటిని శుభ్రం చేసుకోవాలన్నారు.

 

 

అందుకోసం ఏమైనా సలహాలు సూచనలు అవసరమైతే జలమండలి అధికారులను లేదా సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వారిని సంప్రదించవచ్చునన్నారు. బ్రోచర్ ప్రదర్శన అనంతరం  ఇంకుడు గుంత గురించి వివరిస్తూ పాఠశాలలో గతంలో నిర్మించిన ఇంకుడు గుంతను శుభ్రం చేసి ఇసుకను పోయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో డిజిఎం శ్రీను రావుల  మాట్లాడుతూ... విద్యార్థులు జల సంరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. తమ కాలనీలలో, ఇండ్లలో నీరు వృధా అవుతున్నట్లయితే దానిని అరికట్టేందుకు ప్రయత్నించాలన్నారు. ఇంకుడు గుంతల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ టి సురేందర్ జల ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రావు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రజిత మాట్లాడుతూ... జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తమ పాఠశాలలోని విద్యార్థులకు మంచి అంశంపై అవగాహన కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మేనేజర్ ఎన్ రవీందర్ రెడ్డి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎన్ జయసూర్య, ఏటిఓ ఎన్ నర్సింగ్ రావు, లైన్మెన్ ఎండీ అఖిల్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

Related Posts

Latest News