మహబూబాబాద్ పార్లమెంట్ లో బిఎస్పీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలి

బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్

On
మహబూబాబాద్ పార్లమెంట్ లో బిఎస్పీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలి

మరిపెడ - రాజముద్ర న్యూస్: మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ గెలుపుకోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ కోరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో పార్టీ మండల సమీక్షా సమావేశం బిఎస్పీ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తేజావత్ అభినాయక్ పాల్గోని ఆయన మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ పార్టీ పాలనలో భారతరాజ్యాంగం ప్రమాదంలొ పడిందని దానిని రక్షించి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసేది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని అన్నారు.
 
కేంద్రంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారం చేపట్టి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయుటకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అలా జరిగితే సబ్బండ జాతులు అన్ని రకాల హక్కులను కోల్పోయి బానిసలవుతారని అన్నారు.
 
భారతరాజ్యాంగమే ఎజండా గా పనిచేసే బిఎస్పీ పార్టీని అందరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లొ బిఎస్పీ జిల్లా కార్యదర్శి,డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, డోర్నకల్ అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త, నియోజకవర్గ కోశాధికారి కొండ్రు పరశురాములు, మండల ఉపాధ్యక్షులు గుగులోత్ భాసునాయక్, మండల కార్యదర్శి గుగులోత్ నితిన్ నాయక్, మండల నాయకులు ఎడ్ల లక్ష్మణ్, జినక రాజు 
తదితరులు పాల్గొన్నారు.
Views: 11
Tags:

About The Author

Latest News