Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం... త్వరపడండి... రూ. 5 లక్షలు మంజూరు

On
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం... త్వరపడండి... రూ. 5 లక్షలు మంజూరు

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం... త్వరపడండి... రూ. 5 లక్షలు మంజూరు

 

సొంత జాగా ఉన్న వారికి ప్రభుత్వం 

ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా గృహ నిర్మాణానికి కింద రూ.5 లక్షల మంజూరు.

indiramma-houses-108252865


 ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం   హడ్కో(Hudco) నుండి 5000 కోట్ల అప్పు ప్రతిపాదన, 3000 కోట్లు మంజూరు.. మొదటగా 850 కోట్లు విడుదల.

house

Also Read:  Naagaram, Muncipality: అవినీతికి అడ్డాగా మారిన నాగారం మున్సిపాలిటీ 

 
Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద ప్రజలకు మరింత ఊరట నిచ్చే విధంగా పలు పథకాలను అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 6 గ్యారంటీలు పథకాల అమలుకు వడివడిగా అడుగులేస్తుంది.
 
తెలంగాణలో ఇళ్లులేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామని వెల్లడించారు. జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున.. ప్రతి ఏడా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రాష్ట్ర రిజర్వు కోటా కింద మరో 33,500 గృహాలను కేటాయించింది. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ. 7,740 కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణాలకు తొలిదశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరవాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలను పంపింది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని సమీకరించాలని కూడా నిర్ణయించింది.
 
పథకం అమలు కోసం అధికారులు సుమారు రూ.5 వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపగా.. రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో అంగీకరించింది. తొలిదశలో రూ.850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
Views: 254

About The Author

Latest News