Bheemadevarapally, Mulkanoor : ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

On
Bheemadevarapally, Mulkanoor : ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్ పారాబాయిల్డ్ రైస్ మిల్లు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  హనుమకొండ జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ సప్లయ్ ఆఫీసర్ కొమురయ్య, ములుకనూరు సంఘ జనరల్ మేనేజర్ యం. రాం రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం తరువాత సంఘ రైస్ మిల్లు, కాటన్ జిన్నింగ్ మిల్లును సందర్శించారు. జిల్లా అధికారులకు సంఘము నిర్వహిస్తున్న కార్యక్రమంలను గూర్చి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ కార్యక్రమములో సంఘ ఉపాధ్యక్షుడు కడారి ఆదాం, హనుమకొండ జిల్లా సహకార శాఖ, భీమదేవరపల్లి మండల నోడల్ ఆఫీసర్ రవీంద్ర, సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం..

Views: 241
Tags:

About The Author

Latest News