Bheemadevarapally: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం..

ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం..
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు భీమదేవరపల్లి మండలంలోని రాంనగర్, బొల్లోనిపల్లి, మంగలపల్లి, గట్లనర్సింగపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తూ, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధంతాలను విస్మరిస్తుందన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గూల్ల పూర్ణచందర్, భాషా, సుమన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్, గజ్జల రమేష్, పోగుల శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.