Bheemadevarapally, Mulkanoor : నరహరితండాలో గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిల్లల ప్రవర్తన పై దృష్టి పెట్టాలి 

On
Bheemadevarapally, Mulkanoor : నరహరితండాలో గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

ముల్కనూర్ ఎస్సై సాయిబాబు

నరహరితండాలో గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిల్లల ప్రవర్తన పై దృష్టి పెట్టాలి 

గంజాయి రహిత మండలంగా చేయడమే లక్ష్యం 
ముల్కనూర్ ఎస్సై సాయిబాబు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

గంజాయి సేవిస్తున్న వ్యక్తిని ముల్కనూర్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ముల్కనూర్ ఎస్సై సాయిబాబు కథనం మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ శివారు నరహరితండాకి వెళ్లే దారిలో గంజాయి సేవిస్తున్నారని సమాచారం రాగా పోలీస్ వారు అక్కడకు వెళ్లి ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల ప్రజ్వల్ (19) s/o రమేష్ ను పోలీసులు పట్టుకున్నారు. ప్రజ్వల్ ని విచారించగ తను సంవత్సరం క్రితం నుండి  గంజాయి చేయిస్తున్నానని తెలిపాడు. తనకి గంజాయి అవసరం ఉన్నప్పుడు పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన పంజాల సిద్ధార్థ గౌడ్ నుండి విక్రయించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి గ్రామ శివారు కి వెళ్లి తాగే వాడినని చెప్పాడు. ఈ సందర్భంగా ముల్కనూర్ ఎస్సై సాయిబాబు  గంజాయి సంబంధిత ఉత్పత్తులు, అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి గంజాయి రహిత మండలం గా చేయడమే లక్ష్యమని తెలియజేశారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిల్లల ప్రవర్తన పై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read:  అబద్ధపు హామీలతో మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు

Views: 1120
Tags:

About The Author

Latest News