Bheemadevarapally: అభిమానం.. రక్తదానం

మంత్రి పొన్నం బర్త్ డే : హుస్నాబాద్ లో మెగా రక్తదాన శిబిరం
అభిమానం.. రక్తదానం
మంత్రి పొన్నం బర్త్ డే : హుస్నాబాద్ లో మెగా రక్తదాన శిబిరం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి పొన్నం ప్రభాకర్ పై అభిమానం చాటుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన యువకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కరచాలనం చేసి అభినందించారు. మంత్రి మాట్లాడుతూ..ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తం అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలలో ప్రమాదాల బారిన పడినవారిని కాపాడేందుకు ఇలా రక్తదానం చేయడం ఉపయోగపడుతుందన్నారు. సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థకు అందించారు.
అభిమానంతో రక్తదానం
మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై అభిమానంతో రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. నా రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడటం సంతోషం.
-జక్కుల అనిల్
రక్తదానం చేయడం సంతోషంగా ఉంది
పొన్నం అన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉంది. నా రక్తం ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది అంటే చాలా సంతోషం.
-చిటుకూరి అనిల్