Bheemadevarapally : ముల్కనూర్ పోలీసులకు సెల్యూట్ 

On
Bheemadevarapally : ముల్కనూర్ పోలీసులకు సెల్యూట్ 

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం 

ముల్కనూర్ పోలీసులకు సెల్యూట్ 

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

పోలీస్..మనకు ఏ కష్టం వచ్చినా వినిపించే పేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పోలీస్ మాత్రం విధి నిర్వహణలో వెెనకడుగు వెయ్యడు. వృత్తి ధర్మాన్ని విస్మరించడు. తాజాగా ముల్కనూర్ ఎస్సై రాజు  అందుకు సాక్ష్యంగా నిలిచాడు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు, మల్లారం గ్రామానికి వెళ్లే క్రమంలో కొత్తకొండ నుండి మల్లారం రహదారిలో వరద నీటి ప్రవాహం వలన రాకపోకలు నిలిచిపోవడంతో  విద్యార్థులు, కట్కూర్ గ్రామానికి వెళ్లే మహిళలు కొత్తకొండలో ఆగడం జరిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై సిబ్బంది తో హుటాహుటిన కొత్తకొండకు వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులను పోలీస్ వాహనంలో మోడల్ స్కూల్ వసతి గృహానికి సురక్షితంగా తరలించారు. అదేవిధంగా కట్కూర్ గ్రామానికి చెందిన మహిళలను కొత్తకొండ దేవస్థానం లోని వసతి సత్రానికి పంపించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఏదైనా సహాయం కొరకు ముల్కనూర్ పోలీసులను సంప్రదించాలని, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పోలీసులు అందుబాటులో ఉంటామని ఎస్సై రాజు తెలిపారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డ్యూటీలో నిమగ్నమై ఎస్సై రాజు చూపిన వృత్తి ధర్మానికి మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Kothapally: గడ్డి మందు తాగి సుతారి మేస్త్రి ఆత్మహత్య

Views: 174
Tags:

About The Author

Latest News