Bheemadevarapally, Vangara: వంగర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం
సొంత నిధులతో తాగు నీటి బోరు.. తీరిన 4 వ వార్డు సమస్య
సర్పంచ్ గజ్జల సృజన రమేష్
వంగర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం
సొంత నిధులతో తాగు నీటి బోరు.. తీరిన 4 వ వార్డు సమస్య
-సర్పంచ్ గజ్జల సృజన రమేష్
భీమదేవరపల్లి, జనవరి 12, రాజముద్ర డెస్క్:
వంగర గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన గజ్జల సృజన రమేష్, ఎన్నికల్లో గెలిచిన కేవలం నెల రోజుల్లోనే గ్రామ ప్రజల సమస్యలపై స్పందిస్తూ నాలుగో వార్డ్ లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. నాలుగో వార్డ్ లో ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే, సర్పంచ్ గజ్జల సృజన రమేష్ తన సొంత నిధులతో మంగళవారం నాడు బోరు వేయించారు. ఈ బోరు ద్వారా ప్రస్తుతం స్థానిక ప్రజలకు నీటి సమస్య తీరుతున్నందుకు వార్డ్ ప్రజలు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామ ప్రజల మౌలిక సదుపాయాలే తన మొదటి ప్రాధాన్యత అని వంగర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వల్లాల రమేష్ వార్డ్ మెంబర్లు, కాల్వ అంజలి, గజ్జల రమేష్ మారం సతీష్, శ్రీరామోజు మొండయ్య ,బత్తిని రజిత ,రఘు నాయకుల మహేష్, గ్రామ పెద్దలు రఘు నాయకుల వెంకటరెడ్డి తిరుపతిరెడ్డి ,సతీష్ రెడ్డి ,నల్లగోని ప్రభాకర్ గౌడ్ గజ్జల సంజీవ్ రోడ్డ అజయ్ మరి దేవరాజ్ కాల్వ సంపత్ బత్తిన అశోక్ ,బల్ల రాజేష్ , బత్తిని మొండయ్య ,స్థానికులు పాల్గొని సర్పంచ్ కు అభినందనలు తెలిపారు.
