Bheemadevarapally, Rangayapally: మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్
On
భూమి పూజకు రావాలని ఆహ్వానం
మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్
భూమి పూజకు రావాలని ఆహ్వానం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం బుధవారం రంగయ్యపల్లి సర్పంచ్ మండల రజిత మహేష్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నూతన సర్పంచ్ రజిత ను శాలువాతో సత్కరించారు. గ్రామ మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి తన భూమిని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి కి తెలిపారు. ఈ భూమి పూజ కోసం మంత్రిని రావాలని కోరగా సానుకూలంగా స్పందించిన్నట్లు సర్పంచ్ రజిత మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జిమ్మల భీమ్ రెడ్డి, మల్లారెడ్డి, బుచ్చయ్య, రఘుపతి, మొగిలి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Views: 130
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 13:29:42
మంత్రి పొన్నంతో కలిసి పూజలు
