Bheemadevarapally, Kothapally: గడ్డి మందు తాగి సుతారి మేస్త్రి ఆత్మహత్య
On

మధుకర్ మృతితో కొత్తపల్లి లో విషాద ఛాయలు
గడ్డి మందు తాగి సుతారి మేస్త్రి ఆత్మహత్య
మధుకర్ మృతితో కొత్తపల్లి లో విషాద ఛాయలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల మధుకర్(36) అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు. రేణిగుంట్ల మొగిలి పెద్ద కుమారుడు మధుకర్ సుతారి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధతో మనస్థాపం చెంది ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించినట్టు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Views: 247
Tags:
About The Author
Related Posts
Latest News
18 Oct 2025 18:45:38
చేపల చెరువును లీజుకు ఇస్తామని డబ్బులు వసూలు