Bheemadevarapally: కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండ సురేఖ
మంత్రి పొన్నంతో కలిసి పూజలు
కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండ సురేఖ
మంత్రి పొన్నంతో కలిసి పూజలు
భీమదేవరపల్లి, జనవరి 15, రాజముద్ర డెస్క్:
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండగ్రామం లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవి పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండ సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలకారు. దర్శనానంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి కండువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

