Bheemadevarapally: ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్డ్  సర్టిఫికెట్ పొందిన మండలవాసులు

On
Bheemadevarapally: ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్డ్  సర్టిఫికెట్ పొందిన మండలవాసులు

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ల్యాండ్ సర్వేయర్ లైసెన్సుడ్  సర్టిఫికెట్లు

ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్డ్  సర్టిఫికెట్ పొందిన మండలవాసులు 

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ల్యాండ్ సర్వేయర్ లైసెన్సుడ్  సర్టిఫికెట్లు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల పర్యవేక్షణకు ల్యాండ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. శిక్షణ పూర్తి చేసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆదివారం హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ల్యాండ్ సర్వేయర్ లైసెన్సుడ్  సర్టిఫికెట్లు అందజేశారు.

Also Read:  Bheemadevarapally: మానవత్వానికి ప్రతిరూపంగా ఎస్సై రాజు 

ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండలంలోని చింత సురేష్ (మల్లారం ), సిక  ప్రణయ్ దీప్ (కొత్తపల్లి), మాడుగుల రేవతి(ముత్తారం), బునాద్రి స్వామి (వంగర),  బోడ రఘువరన్ (సాయినగర్), గడ్డ రత్నాకర్ (కొప్పూర్),  ఐలబోయిన అనిల్ కుమార్ (మాణిక్యపూర్) ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్డ్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. శిక్షణ సమయంలో సురేష్ భూసర్వే పద్ధతులు, డిజిటల్ మ్యాపింగ్, జియోట్యాగింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ పొందారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో ఘనంగా రావణ దహనం

తన ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో శిక్షణ పొంది లైసెన్స్ అందుకున్న  సురేష్, ప్రణయ్ లను భీమదేవరపల్లి మండల ప్రభుత్వ ల్యాండ్ సర్వేయర్ విజయ భాస్కర్ అభినందించారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది రైతులకు తమ భూముల ఖచ్చితమైన సరిహద్దులు తెలియక వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ల్యాండ్ సర్వేయర్లను నియమిస్తోంది. ల్యాండ్ సర్వేయర్లు జిపిఎస్, టోటల్ స్టేషన్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తిస్తారు. ఇది రైతులకు తమ భూమిపై హక్కు స్పష్టతను ఇస్తుందని తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Kothapally: గడ్డి మందు తాగి సుతారి మేస్త్రి ఆత్మహత్య

Views: 180
Tags:

About The Author

Latest News