Bheemadevarapally: భీమదేవరపల్లిలో మెగా వైద్య శిబిరం
రెడ్ క్రాస్ హనుమకొండ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్

ఉచిత శిబిరాలతో పేదలకు వైద్యం
భీమదేవరపల్లిలో మెగా వైద్య శిబిరం
ఉచిత శిబిరాలతో పేదలకు వైద్యం
రెడ్ క్రాస్ హనుమకొండ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్:
ఉచిత వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్యం అందజేయడమే లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ హనుమకొండ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ అన్నారు. భీమదేవరపల్లి మండల కేంద్రం గ్రామపంచాయతీ ఆవరణ లో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెద్ది వెంకటనారాయణ గౌడ్ మట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఎక్కువ మంది పేద ప్రజలు చికిత్స పొందాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి షుగర్, బీపీ,పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముల్కనూర్ ఎస్సై రాజు రావడం జరిగింది. వైద్య శిబిరం అనంతరం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్, వైద్య సిబ్బందిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువతో సత్కరించారు. భీమదేవరపల్లి లో రెడ్ క్రాస్ హనుమకొండ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.