Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గంపై కేసు నమోదు
ఆపై మరొకరికి మోసపూరితంగా చెరువు లీజు
On
చేపల చెరువును లీజుకు ఇస్తామని డబ్బులు వసూలు
ముల్కనూర్ మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గంపై కేసు నమోదు
చేపల చెరువును లీజుకు ఇస్తామని డబ్బులు వసూలు
ఆపై మరొకరికి మోసపూరితంగా చెరువు లీజు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
కమలాపూర్ గ్రామానికి చెందిన అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముల్కనూర్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు అలుగు సంపత్, కార్యదర్శి నాగరాజు, డైరెక్టర్లు కనకయ్య, రాంబాబు, పోచయ్య, రవి, మొగిలి, పెద్ద కనకయ్యలపై ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం జరిగింది. బాధితుడు అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ముల్కనూర్ గ్రామంలోని చేపల చెరువును లీజుకు ఇస్తామని నమ్మించి తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని, అనంతరం ఆ చెరువును నారాయణగిరి గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తికి మోసపూరితంగా లీజుకు ఇచ్చి తనను ఆర్థికంగా నష్టపరిచారని అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్ ఫిర్యాదు మేరకు ముల్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Views: 668
Tags:
About The Author
Related Posts
Latest News
29 Oct 2025 21:07:25
కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం
