Bheemadevarapally, Mulkanoor: దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి
దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ముల్కనూర్ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు అందించిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసిన ఘనత సోనియా గాంధీదేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది అని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిటుకూరి అనిల్, ముత్యం అశోక్, జక్కుల అనిల్, చిదురాల స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
