Bheemadevarapally, Mulkanoor: గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 

సమ్మక్క సారక్క అబ్భియా..

On
Bheemadevarapally, Mulkanoor: గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 

అంటూ మారుమ్రోగిన జాతర ప్రాంగణం

గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 

సమ్మక్క సారక్క అబ్భియా..

అంటూ మారుమ్రోగిన జాతర ప్రాంగణం

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దె పైకి రావడంతో మహా జాతర ప్రారంభమైంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని గొల్లవాడలో ఉన్న సారలమ్మ గుడిలో ఆదివాసి సంప్రదాయాల ప్రకారం.. కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జంతు బలిలు ఇచ్చారు. అమ్మవారి ప్రతి రూపమైన పసుపు కుంకుమలను భరణి రూపంలో తీసుకొని కాళ్ళు నడకన డప్పు చప్పుల్లతో శివసత్తుల పూనకాల మధ్య అంగరంగ వైభవంగా సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో సమ్మక్క సారలమ్మ మహా జాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మని తీసుకొస్తున్న క్రమంలో దారి పొడవున భక్తులు నీరాజనం పలికారు. ఆరోగ్యం బాగాలేని భక్తులు, మొక్కుకున్నారు. పిల్లల కోసం తపించే మహిళలు వరంపట్టారు. సమ్మక్క సారక్క అబ్భియా.. జాలారు బండల్లో  అబ్భియా.. జంపన్న వాగుల్లో అబ్భియా.. అంటూ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం మారుమోగాయి. కోరిన వరాలు ఇచ్చే వనదేవతలను 15 రోజుల నుంచి మది నిండా తలుచుకుంటూ పూజిస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీఐ పులి రమేష్, ఎస్సై రాజు ,దివ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మహా ఘట్టంలో కోయ పూజారులు, శివసత్తులు, గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, జాతర చైర్మన్ జక్కుల ఐలయ్య కమిటీ మెంబర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Rangayapally: మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్

Views: 3
Tags:

About The Author

Related Posts

Latest News