Bheemadevarapally, Vangara: వంగర గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం 

వంగర గ్రామ సర్పంచ్ సృజన రమేష్

On
Bheemadevarapally, Vangara: వంగర గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం 

ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కూలీలకు ఆర్థిక భరోసా 

వంగర గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం 

ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కూలీలకు ఆర్థిక భరోసా 

వంగర గ్రామ సర్పంచ్ సృజన రమేష్

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జల సృజన రమేష్ మాట్లాడుతూ.., ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలు, కూలీలకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకమని తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హుడైన ఉపాధి కూలీకి పని దొరికేలా చర్యలు తీసుకుంటామని, వంద రోజుల ఉపాధి లక్ష్యాన్ని చేరుకునేలా గ్రామపంచాయతీ కృషి చేస్తుందని అన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు కూలీల జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ పనులు ప్రారంభించామని, పనుల అమలులో పారదర్శకత, నాణ్యత, వేగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వల్లాల రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రజిత, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 

Views: 16
Tags:

About The Author

Latest News