Bheemadevarapally: పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

ముల్కనూర్ ఎస్సై రాజు

On
Bheemadevarapally: పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

మొబైల్ ఫోన్ కొనుగోలు సమయంలో సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నెంబర్లు భద్రపరచుకోవాలి

పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

మొబైల్ ఫోన్ కొనుగోలు సమయంలో సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నెంబర్లు భద్రపరచుకోవాలి 

-ముల్కనూర్ ఎస్సై రాజు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితురాలికి మంగళవారం నాడు ఎస్సై రాజు అప్పగించారు. హాసన్పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన ప్రసన్న కుమారి తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు. బాధితురాలు ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఐఎంఈఐ నెంబర్ తీసుకొని సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి పోగొట్టుకున్న సెల్ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. అనంతరం బాధితురాలికి అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ.. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు అవుతాయని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నెంబర్లు భద్రపరచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఇతర ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నందున మొబైల్ ఫోన్ల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Also Read:  Greater Hyderabad: హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!

Views: 82
Tags:

About The Author

Latest News