Greater Hyderabad: హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!

•ఫిబ్రవరి 10న విభజన ప్రకటన - పోలీసు కమిషనరేట్ల తరహాలోనే కొత్త సరిహద్దులు

On
Greater Hyderabad: హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!

Greater Hyderabad Muncipal Corporation:  హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!
ఫిబ్రవరి 10న విభజన ప్రకటన - పోలీసు కమిషనరేట్ల తరహాలోనే కొత్త సరిహద్దులు
ఆగస్టు 2026 నాటికి కొత్త కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ..?
హైదరాబాద్, రాజముద్ర వెబ్ డెస్క్:
తెలంగాణ(Telangana) రాజధాని భాగ్యనగర పాలనా యంత్రాంగం సరికొత్త మలుపు తిరగబోతోంది. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం(State Government) నిర్ణయించింది. ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో, అదే రోజున ఈ చారిత్రాత్మక నిర్ణయంపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
పరిపాలనా సౌలభ్యమే ప్రధాన లక్ష్యం
ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా ఉన్న జీహెచ్‌ఎంసీని.. హైదరాబాద్(Hyderabad), శేరిలింగంపల్లి(Sherilingam Pally), మల్కాజిగిరి(Malkajgiri) కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించనున్నారు.

418291-768-512-25472722-thumbnail-16x9-telangana-merging-ghmc

 

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పోలీసు కమిషనరేట్ల(Police Commissionerate) విభజన రేఖలనే మున్సిపల్ పరిధికి కూడా ప్రామాణికంగా తీసుకోనున్నారు.


* హైదరాబాద్ కార్పొరేషన్ (Greater Hyderabad Muncipal Corporation)
: కోర్ సిటీ ప్రాంతాలు మరియు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి దీని కిందకు వస్తాయి.


* శేరిలింగంపల్లి కార్పొరేషన్. (Greater Sherilingam Pally Muncipal Corporation: ఐటీ కారిడార్, సైబరాబాద్ మరియు ఫ్యూచర్ సిటీ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఇందులో విలీనం కానున్నాయి.


* మల్కాజిగిరి కార్పొరేషన్(Greater Malkajigiri Muncipal Corporation): తూర్పు హైదరాబాద్‌లోని నివాస ప్రాంతాలు మల్కాజిగిరి (రాచకొండ) కమిషనరేట్ పరిధిలో ఒక ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పడతాయి.
అధికారుల బదిలీలు పూర్తి - ఎన్నికలకు సన్నద్ధం
విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన ఐఏఎస్ అధికారుల బదిలీలను పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కర్ణన్(GHMC Commissioner R. V. Karnan), అదనపు కమిషనర్లుగా సృజన, వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. విభజన ఉత్తర్వులు వెలువడిన ఆరు నెలల లోపు, అంటే ఆగస్టు 2026 నాటికి మూడు కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనాభా పెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచడం మరియు పారదర్శక పాలన అందించడమే ఈ భారీ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

Views: 229
Tags:

About The Author

Latest News

Greater Hyderabad: హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ! Greater Hyderabad: హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!
Greater Hyderabad Muncipal Corporation:  హైదరాబాద్‌ మున్సిపల్ పాలనలో బిగ్ అప్‌డేట్: మూడు ముక్కలుగా జీహెచ్‌ఎంసీ!ఫిబ్రవరి 10న విభజన ప్రకటన - పోలీసు కమిషనరేట్ల తరహాలోనే కొత్త...
Bheemadevarapally, Mulkanoor: గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 
Bheemadevarapally: కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండ సురేఖ 
Bheemadevarapally, Vangara: వంగర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం
Bheemadevarapally, Rangayapally: మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్
Bheemadevarapally, Mulkanoor: దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
Bheemadevarapally : ముల్కనూర్ పోలీసులకు సెల్యూట్