Bheemadevarapally, Vangara: సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలి
డాక్టర్ రుబీనా
.jpg)
ప్రతి నేర్చుకున్న చేయి ఒక ప్రాణానికి రక్షణ
సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలి
ప్రతి నేర్చుకున్న చేయి ఒక ప్రాణానికి రక్షణ
-డాక్టర్ రుబీనా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
గుండెపోటు వచ్చిన రోగికి మొదటి కొన్ని నిమిషాల్లోనే సీపీఆర్ అందించడం ద్వారా జీవించే అవకాశాలు రెండింతల నుంచి మూడింతల వరకు ఉంటుందని వంగర పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుబీనా అన్నారు. బుధవారం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే సీపీఆర్ పద్ధతులను నేర్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రుబీనా మాట్లాడుతూ.. కార్డియో పల్మనరీ రెససికేషన (సీపీఆర్) అనేది గుండె ఆగిపోవడం లేదా శ్వాస ఆగిపోవడంవంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన పద్ధతి అన్నారు. సీపీఆర్‌పై అవగాహన పెంచుకొని నైపుణ్యాన్ని నేర్చుకుంటే మనిషి జీవితాన్ని కాపాడవచ్చన్నారు. ప్రతి నేర్చుకున్న చేయి ఒక ప్రాణానికి రక్షణ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్, స్కూల్ ప్రిన్సిపల్ అఫ్రీన్, ఉపాధ్యాయులు, సూపర్వైజర్ మోహన్, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.