Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో ఘనంగా రావణ దహనం
ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ఆటపాటలు

గత 8 ఏళ్లుగా హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఏర్పాటు
ముల్కనూర్ లో ఘనంగా రావణ దహనం
గత 8 ఏళ్లుగా హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఏర్పాటు
ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ఆటపాటలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
దసరా పండుగను భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. గురువారం సాయంత్రం పోచమ్మ ఆలయం వద్ద జమ్మి కొమ్మ కు షమీ పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నా పెద్ద అందరూ కొత్త బట్టలు ధరించి గ్రామం లో ఏర్పాటు చేసిన దుర్గ దేవి మండపాల వద్ద అమ్మవారి ఆశీస్సులతో పాటు కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా రాత్రి హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ముల్కనూర్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమ దహన కార్యక్రమ వేడుక ఘనంగా జరిగింది. రావణ దహన కార్యక్రమానికి ముందు కుమార్ స్వామి బృందం భక్తి పాటలు, యువకుల కోలాటం, మహిళల బతుకమ్మ ఆట పాటలు చూపారులను ఆకట్టుకున్నాయి. అనంతరం రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ.. గత 8 ఏళ్లుగా రావణ సంహార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చెడుపై మంచిని సాధించిన రోజు దసరా పండుగ అని అన్నారు. హనుమాన్ వ్యాయామశాలను 1989 లో గుడికందుల రాజయ్య ప్రారంభించినట్లు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో హిందూ పండగలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ వ్యాయామశాల లోని సభ్యులు ఎందరో పోలీస్ ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు వైపు వెళ్ళకూడదని దిశా నిర్దేశ్యం చేశారు. ఈ కార్యక్రమం లో గుడికందుల రాజయ్య, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, బత్తిని రాంబాబు, త్రిజ్ఞానేష్, రాహుల్, బైరి సదానందం,అభినయ్, లోకేష్, హనుమాన్ వ్యాయామశాల సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.