Bheemadevaraplly, Gatlanarsingapur: గట్ల నర్సింగాపూర్ లో పేకాట స్థావరం పై దాడి

7 గురు అరెస్ట్, నగదు స్వాదీనం

On
Bheemadevaraplly, Gatlanarsingapur: గట్ల నర్సింగాపూర్ లో పేకాట స్థావరం పై దాడి

పేకాట చ‌ట్ట విరుద్ధం, ఎవ‌రైనా ఆడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు

గట్ల నర్సింగాపూర్ లో పేకాట స్థావరంపై దాడి

7 గురు అరెస్ట్, నగదు స్వాదీనం

పేకాట చ‌ట్ట విరుద్ధం, ఎవ‌రైనా ఆడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు
ముల్కనూర్ ఎస్సై రాజు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

గట్లనర్సింగాపూర్ గ్రామ శివారులో మంగళవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.2000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ముల్కనూర్ ఎస్సై రాజు కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామ శివారులో గుట్టుచ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. విశ్వ‌సనీయ స‌మాచారం అందుకున్న ఎస్ఐ రాజు పోలీసుల‌తో క‌లిసి పేకాట స్థావరం  వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ. 2000 న‌గ‌దు,  పేక ముక్క‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం వారిని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పేకాట చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, ఎవ‌రైనా ఆడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్సై రాజు  హెచ్చ‌రించారు.

Also Read:  Bheemadevarapally: మండల ప్రజల మన్ననలు పొందిన ఎస్సై సాయిబాబు బదిలీ

Views: 601
Tags:

About The Author

Latest News