Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో రోడ్డు గుంతలు – వర్షం రాగానే దారుణ స్థితి

On
Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో రోడ్డు గుంతలు – వర్షం రాగానే దారుణ స్థితి

కాలనీవాసుల ఇబ్బందులకు పరిష్కారం ఎప్పుడు..?

ముల్కనూర్ లో రోడ్డు గుంతలు – వర్షం రాగానే దారుణ స్థితి

కాలనీవాసుల ఇబ్బందులకు పరిష్కారం ఎప్పుడు..?

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్ :

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని అంగడి సంత, 8వ వార్డు కాలనీల్లో రోడ్డు పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా మారుతోంది. వర్షం పడిన ప్రతిసారి రహదారులు అంతా గుంతలతో నిండిపోతూ, నీరు నిల్వలు ఏర్పడుతున్నాయి. దీంతో కాలనీవాసులు నిత్యజీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు జరుపుకోవడం ప్రమాదకరంగా మారగా, రెండు చక్రాల వాహనదారులు జారి పడే ప్రమాదం ఎక్కువవుతోంది. అంగడి సంత, గర్ల్స్ హైస్కూల్ నుండి బ్యాంకు వెళ్లే ప్రాంతంలో వర్షం పడితే రోడ్డు బురదతో నిండిపోతూ పూర్తిగా మట్టి దారిగా మారిపోతోంది. గర్ల్స్ హై స్కూల్ నుండి ముల్కనూర్ సొసైటీ బ్యాంకు వైపు వెళ్లే ప్రజలు మార్కెట్‌కు వచ్చే ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు పలుమార్లు ఈ సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల విన్నపాలు విన్నట్టే విని వదిలేస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా కానీ ఎలాంటి స్పందన లేదు అని వాపోతున్నారు. పాఠశాలకు వెళ్ళే పిల్లలు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని మరమ్మతు చేయాలి అని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read:  Bheemadevarapally: మండల ప్రజల మన్ననలు పొందిన ఎస్సై సాయిబాబు బదిలీ

IMG-20250902-WA0025

Also Read:  Bheemadevarapally, Mulkanoor: వివేకనంద యూత్ ఆధ్వర్యంలో కొలువు దీరిన గణపయ్య 

Views: 208
Tags:

About The Author

Latest News