Bheemadevarapally, Mulkanoor: వివేకనంద యూత్ ఆధ్వర్యంలో కొలువు దీరిన గణపయ్య 

On
Bheemadevarapally, Mulkanoor: వివేకనంద యూత్ ఆధ్వర్యంలో కొలువు దీరిన గణపయ్య 

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రోత్సవాలు 

వివేకనంద యూత్ ఆధ్వర్యంలో కొలువు దీరిన గణపయ్య 

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రోత్సవాలు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండపాన్ని యూత్ సభ్యులు మామిడి తోరణాలు, అరటి ఆకులు, డెకరేషన్ క్లాత్ లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. గత 30 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఇక్కడ వినాయకుడికి యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనాథ్, శ్రీధర్, యుగేందర్, విజయ్, అభినయ్, లోకేష్, విగ్నేష్, చాణక్య, లోహితాక్ష్, లడ్డు, అక్షయ్, సుకృత్, లలిత్ వర్మ, సమ్మయ్య పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally : 79 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

Views: 88
Tags:

About The Author

Latest News