Bheemadevarapally: ముల్కనూర్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజు 

On
Bheemadevarapally: ముల్కనూర్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజు 

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తా 

ముల్కనూర్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజు 

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తా 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

ముల్కనూర్ నూతన ఎస్సైగా ఎం. రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గీసుకొండ ఎస్సైగా  పనిచేస్తూ ముల్కనూర్ కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న నండ్రు సాయిబాబు వర్ధన్నపేటకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై సాయిబాబు ను పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన రాజు మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు (Law and Order) పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ

Views: 375
Tags:

About The Author

Latest News