Bheemadevarapally : 79 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

On
Bheemadevarapally : 79 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

79 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

Also Read:  Bheemadevarapally, vangara: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ  మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.  అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండాను ఎగరవేశారు. మండలంలోని ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారు రాజేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో  వీరేశం, ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయిబాబు,ఎస్సై దివ్య,  ముల్కనూర్ సహకార మహిళా డెయిరీలో అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రెహమాన్ , పశు వైద్యశాలలో డాక్టర్ రఘు బాబు, డాక్టర్ మాలతి, స్వాతంత్ర సమరయోధుల భవనం బొజ్జపూరి వెంకటయ్య మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. వంగర పివి రంగారావు బాలికల గురుకుల విద్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 79 ఫీట్ల ఎత్తులో  9.12 అడుగుల జాతీయ జెండాను ప్రిన్సిపాల్ అఫ్రీన్ సుల్తానా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేలా ఏర్పాటు చేసినట్లు ఎసీపి తెలిపారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్, ఎస్సైలు సాయిబాబు, దివ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.643f25938271494c93bf8ee9fa975c5c

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

Views: 115
Tags:

About The Author

Latest News