Bheemadevarapally, Vangara : వంగర ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య

ప్రాథమిక ఆరోగ్య కేంద్రలపై నమ్మకం పెంచాలి
వంగర ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం పెంచాలి
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హనుమకొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. భీమదేవరపల్లి మండలం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాధి నిరోధక టీకాలు, ఎన్ సి డి స్క్రీనింగ్, ఫీవర్ సర్వే, డ్రై డే, తల్లిపాల ప్రాముఖ్యత కార్యక్రమాల గురించి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆశా కార్యకర్తలకు సూచించారు.ఇన్ పేషెంట్, అవుట్ పేషంట్, ఫార్మసీ, లేబరు రూమ్,వార్డులను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనీ సమస్యలను సిబ్బంది డిఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ బీపీ ,షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా సరిపడా మందులను ఇవ్వాలన్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం కలిగించాలని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ జ్యోతి, హెడ్ నర్స్ అరుణ, స్టాఫ్ నర్స్, సిస్టర్లు, ఆశా కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.