Bheemadevarapally, Gatlanarsingapoor: పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం పదిలం
On

డాక్టర్ రూబీన
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం పదిలం
డాక్టర్ రూబీన
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని పల్లె దవాఖాన పరిసరాలను పరిశుభ్రం చేశారు. వంగర పి హెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ రుబీన సూచనల మేరకు గురువారం నాడు పల్లె దవాఖాన పరిసరాలను ఆశ కార్యకర్తలు పరిశుభ్రం చేశారు. ఆరోగ్య పరిరక్షణ కోసం చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన దోమలు వ్యాప్తి చెందవని డాక్టర్ రుబీనా పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎటువంటి రోగాలు దరి చేరవని తెలిపారు. గ్రామంలోని పల్లెదవాఖానలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మెరుగైన వైద్యం అందించబడుతుందని, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని డాక్టర్ రుబీనా తెలిపారు.
Views: 87
Tags:
About The Author
Related Posts
Latest News
16 Aug 2025 20:00:11
రోడ్డు పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలి