Bheemadevarapally, vangara: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

On
Bheemadevarapally, vangara: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వంగర పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ రుబీన

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వంగర పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ రుబీన

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ రుబీనా పేర్కొన్నారు. గురువారం నాడు భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి, రత్నగిరి, గ్రామాల్లో వంగర పిహెచ్సి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జ్వరం కేసులను గుర్తించి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు( మలేరియా నిర్ధారణ) నిర్వహించారు. దోమల వలన వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, పరిసరాల శుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మోహన్, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

Views: 7
Tags:

About The Author

Latest News