Bheemadevarapally, Mulkanoor: భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ

యజ్ఞోపవీత శుభాకాంక్షలు తెలుపుకున్న పద్మశాలి కులస్తులు
భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ
యజ్ఞోపవీత శుభాకాంక్షలు తెలుపుకున్న పద్మశాలి కులస్తులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
సనాతన ధర్మంలో మరో ముఖ్యమైన పండుగ జంధ్యాల పూర్ణిమ. జంధ్యం అనగా మూడు దారాలతో కూడిన ఒక దారం. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని శ్రీ భక్త మార్కండేయ సన్నిధిలో పద్మశాలి కుల బాంధవులు జంధ్యాల పూర్ణిమ పండుగ అట్టహాసంగా జరుపుకున్నారు. వేద పండితులు నాగిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో మంత్రోచ్ఛరణల మధ్య పద్మశాలి కులస్తులు యజ్ఞోపవీత ధారణ జరుపుకున్నారు. పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి నూతన యజ్ఞోపవీతాన్నీ ధరించారు. అనంతరం భక్త మార్కండేయుడిని దర్శించుకున్నారు. ఒకరినొకరు యజ్ఞోపవీత శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పద్మశాలి కులస్తులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శుద్ధిని, శాంతిని, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని సూచిస్తుంది, ఈ పవిత్ర ఆచారం ద్వారా వ్యక్తి తన బాధ్యతలను సమాజం పట్ల తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపల్లి రాజు, దార్న శ్రీనివాస్, ఊసకోయిల ప్రకాష్, ఉడుత విటోబా, చిదురాల శ్రీనివాస్, చిదురాల రమేష్, లక్ష్మీనరసింహ, ఉడుత శ్రీనివాస్, దార్న గణేష్, కోడూరి యాదగిరి, బండారి శ్రీనివాస్, వెంగళ రామస్వామి, చిదురాల ప్రభాకర్, రాపెల్లి అశోక్, ఊసకోయిల కిషన్,దార్న భాస్కర్, గోలి రవి,పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.