Bheemadevarapally, Mulkanoor: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం..
On

సందడిగా రాఖీ దుకాణాలు
ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం..
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
అన్నదమ్ములు, అక్కచెల్లమ్మల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని రాఖీ దుకాణాల్లో రంగురంగుల భిన్నమైన రాఖీలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లుగా రూ. 2 నుంచి రూ. 3 వేల వరకు వివిధ ధరల్లో రాఖీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. సోదరులకు రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. రక్షా బంధన్ పండుగ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, నోరు తీపి చేసే ఆనవాయితీ తెలిసిందే. దీంతో రాఖీ దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడటంతో వ్యాపారాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Views: 172
Tags:
About The Author
Related Posts
Latest News
09 Aug 2025 10:33:38
యజ్ఞోపవీత శుభాకాంక్షలు తెలుపుకున్న పద్మశాలి కులస్తులు