Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

బిజెపి మండల మాజీ అధ్యక్షులు పైడిపల్లి పృధ్విరాజ్ గౌడ్

On
Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

పాత్రికేయ మిత్రులకు సన్మానం 

పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

-పాత్రికేయ మిత్రులకు సన్మానం 

-బిజెపి మండల మాజీ అధ్యక్షులు పైడిపల్లి పృధ్విరాజ్ గౌడ్

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండల పత్రిక మిత్రులను, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను స్థానిక ముల్కనూర్ లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి మండల మాజీ అధ్యక్షుడు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ... పాత్రికేయుల సమస్యలను సానుకూలంగా పరిష్కారం చూపుతామని అన్నారు. ఎల్లవేళలా ప్రజల సమస్యలను పరిష్కరించే పత్రిక మిత్రుల సేవలు అమోఘం అని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కారం దిశగా పత్రిక మిత్రులు పని చేస్తుంటారని కొనియాడారు. మండలంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, పాత్రికేయులకు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు దొంగల కొమరయ్య, అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు గండు సారయ్య, గద్దె రాజమణి, గద్దె సమ్మయ్య, అంబీర్ కవిత, మార్పాటి అశోక్ రెడ్డి, మేకల రాజు, రాణాప్రతాప్, లక్కిరెడ్డి మల్లారెడ్డి, సిద్ధమల్ల రమేష్, బొజ్జపూరి పృథ్వీరాజ్, చొప్పరి నవీన్, అయిత సాయి తేజ, బండారి కరుణాకర్, ప్రదీప్ రెడ్డి, ములుగు సంపత్, అమరేందర్, శ్రీనివాస్,మహేష్, ఉదయ్, కాలేరు వికాస్, బిజెపి కార్యకర్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: "విశ్వశాంతి స్కూల్" పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Views: 291
Tags:

About The Author