Bheemadevarapally: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి 

రక్తపోటు, మదుమేహం ఉన్న వారికి క్రమం తప్పకుండా ఔషధాలు ఇవ్వాలి 

On
Bheemadevarapally: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి 

ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి 

-రక్తపోటు, మదుమేహం ఉన్న వారికి క్రమం తప్పకుండా ఔషధాలు ఇవ్వాలి 

-ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలి 
-జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య

భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్:

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రి పట్ల అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. శనివారం నాడు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంను ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో రేబిస్, టీటీ వ్యాక్సిన్ లను తప్పకుండ భద్రపరచాలని, ప్రజలకు అందుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి క్రమం తప్పకుండా ఔషధాలను ఇవ్వాలని సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ముల్కనూర్, వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సుమారు 150 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సుధాకర్ హాస్పిటల్ వారు ఉచితంగా చేసినందుకు గాను డాక్టర్ సుధాకర్ ని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ నివేదిత, హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు, సిస్టర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:  Jagityala, Korutla: జగిత్యాల జిల్లాలో దారుణం

IMG-20250719-WA0048

Also Read:  Maddhiraala: 42 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

Views: 251
Tags:

About The Author