Kukatpalli: ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సునీత
మూసాపేట్ సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ సునీత ఆస్తి మ్యూటేషన్ కు లంచం డిమాండ్

30, 000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సునీత
మూసాపేట్ సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ సునీత ఆస్తి మ్యూటేషన్ కు లంచం డిమాండ్
30, 000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కూకట్ పల్లి, రాజముద్ర న్యూస్:
లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ (ACB) చేతికి చిక్కిన ఘటన కూకట్పల్లి జోనల్ (kukat palli) పరిధిలోని మూసాపేట సర్కిల్ లో చోటు చేసుకుంది. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ (Musapate circle)ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుండి 80 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆమెను బ్రతిమిలాడటంతో 30 వేల రూపాయలకు తగ్గేది లేదంటూ తెగేసి చెప్పింది. ఆమె వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా ఈ మంగళవారం మధ్యాహ్నం సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఆమె నుండి 30 వేల రూపాయలు, బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు.