Maganti Gopinath: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
• ఆదివారం తెల్లవారుజామున బులిటెన్ ప్రకటించిన ఏఐజి డాక్టర్లు
On

Maganti Gopinath: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
Maganti Gopinath | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్(BRS MLA) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఏఐజి డాక్టర్లు మాగంటి గోపీనాథ్ మృతి చెందారని తెలిపారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, పలువురు నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ గుండె సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Maganti Gopinath | జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం చాతిలో నొప్పి రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాగంటి గోపీనాథ్ వరుసగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014, 2018, 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మాగంటి గోపినాథ్కు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రజలలో అపారమైన విశ్వాసమున్న నాయకుడిగా పేరుపొందారు. ఆయన మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బిఆర్ఎస్ మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,
బిఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
Views: 7
About The Author
Related Posts
Latest News
19 Jul 2025 18:27:03
ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలి