Bheemadevarapally, Mulkanoor: "విశ్వశాంతి స్కూల్" పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆపదలో ఉన్న స్నేహితులను మనమంతా ఆదుకోవాలి

On
Bheemadevarapally, Mulkanoor:

విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువబోవద్దు 

"విశ్వశాంతి స్కూల్" పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

-ఆపదలో ఉన్న స్నేహితులను మనమంతా ఆదుకోవాలి

-విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువబోవద్దు 
-19 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

ఆపదలో ఉన్న స్నేహితులను మనమంతా ఆదుకోవాల్సిన అవసరం ఉందని... విద్యాబుద్ధ నేర్పిన గురువులను ఎప్పటికీ మరువబోమని పలువురు పూర్వ విద్యార్థులు (Alumni Students) అభిప్రాయపడ్డారు. భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం ముల్కనూరు (Mulkanoor) లోని శ్రీ విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో 2005 -2006 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 19 సంవత్సరాల తర్వాత పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తాజా పరిస్థితులను, కుటుంబ వివరాలను సభావేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రద్ధాభిమానాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా చనిపోయిన ఉపాధ్యాయుడికి మిత్రుడికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కాలంతోనూ మారని మమకారాన్ని ప్రతిబింబించేలా, నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఒకరితో ఒకరు కౌగిలించుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ జ్ఞాపకాల సందడి మధ్యే పాఠశాలలో వారికి బోధించిన ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. సమ్మేళనం శుభాకాంక్షలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా ఉత్సాహంగా సాగింది. అనంతరం అందరికీ జ్ఞాపికలు పంపిణీ చేసి, విందు భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ వేడుకలో పూర్వ ఉపాధ్యాయులు  ఆదిరెడ్డి, ఉమామహేశ్వర్, మహేందర్, మల్లేష్, కృష్ణ, రాజు, శ్రీనివాస్, రవి, మంజుల, పద్మ, జయ. పూర్వ విద్యార్థులు స్రవంతి, వైశాలి, పద్మ, రాధిక, లవన్, ప్రవీణ్, విద్యాసాగర్,అమర్నాథ్, కిషోర్, విక్రమ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, kothakonda: అక్రమ పట్టా చేసుకొని గోస పెడుతుండు 

Views: 636
Tags:

About The Author

Latest News