Bheemadevarapally, Koppur: కొప్పూర్ లో అర్హత లేకుండా ఆర్ఎంపీ ఔషధాలు విక్రయం
హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్

71 రకాల ఔషధాలు స్వాధీనం
కొప్పూర్ లో అర్హత లేకుండా ఆర్ఎంపీ ఔషధాలు విక్రయం
71 రకాల ఔషధాలు స్వాధీనం
హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
ఔషధ నియంత్రణ అధికారి (Drug inspector) నుండి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా ఆర్ఎంపీ వద్ద 71 రకాల ఔషధాలు లభ్యమైనట్లు హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన విలసాగరపు శ్రీనివాస్ వృత్తిరీత్యా ఆర్ఎంపీ గా కొప్పూరు గ్రామంలో జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇతను ఎలాంటి అర్హత (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి పొందిన ధ్రువీకరణ పత్రం ) లేకుండా ఔషధాలను విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నాడు హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 71 రకాల ఔషధాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఇందులో యాంటీబయాటిక్, స్టెరైడ్ మందులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరు ఔషధాలు విక్రయించిన, గడువు ముగిసిన ఔషదాలను, ఫిజీషియన్ శాంపిల్స్ అమ్మిన తగిన చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో అనేక చోట్ల తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తనిఖీల్లో ఏడు నుంచి 8 లక్షలు వరకు ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్ఎంపి నుండి లభ్యమైన ఔషదాలను ఎక్కడి నుండి విక్రయించాడు అని విచారణలో తెలుస్తుందని తెలిపారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజలక్ష్మి, జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, భూపాలపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని పాల్గొన్నారు.