Bheemadevarapally, Mulkanoor: టీజేఎఫ్ సభకు జర్నలిస్టులు తరలి రావాలి
On

టీజేఎఫ్ మండల ప్రెసిడెంట్ కోల రమేష్
టీజేఎఫ్ సభకు జర్నలిస్టులు తరలి రావాలి
టీజేఎఫ్ మండల ప్రెసిడెంట్ కోల రమేష్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
తెలంగాణ జర్నలిస్టు ఫోరం (TJF) ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 31న హైదరాబాదులోని జలవిహార్ లో జరిగే టీజేఎఫ్ రజతోత్సవ సభకు జర్నలిస్టులు భారీగా తరలి రావాలని టీజేఎఫ్ మండల సంఘం అధ్యక్షులు కోల రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అన్నారు. కార్యక్రమంలో మండల జర్నలిస్టులు అప్పని సిద్ధు, అలుగు రమేష్, శిఖ బిక్షపతి, మేకల శ్యామ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
Views: 31
Tags:
About The Author
Related Posts
Latest News
19 Jul 2025 18:27:03
ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలి