Bheemadevarapally, Vangara: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
On

డాక్టర్ రుబీనా
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
-డాక్టర్ రుబీనా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ రుబీనా అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వంగర ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని, ఇంటి పరిసరాల్లో పండ్లు,పూలు, నీడనిచ్చె మొక్కలు నాటాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం పెరగడం, చెట్ల నరికివేత, వాయు కాలుష్యం, జల కాలుష్యం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Jagityala, Korutla: జగిత్యాల జిల్లాలో దారుణం
Views: 59
Tags:
About The Author
Related Posts
Latest News
30 Jul 2025 13:39:03
పాత్రికేయ మిత్రులకు సన్మానం