Bheemadevarapally, Mulkanoor :సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

On
Bheemadevarapally, Mulkanoor :సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

ముల్కనూరు ఏఎస్ఐ కటకం సంపత్

సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి 

-ముల్కనూరు ఏఎస్ఐ కటకం సంపత్ 

Also Read:  Bheemadevarapally: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: "విశ్వశాంతి స్కూల్" పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ముల్కనూర్ ఏఎస్ఐ కటకం సంపత్ అన్నారు. ముల్కనూర్ మహిళ స్వకృషి డైరీ లో ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డైరీ సిబ్బంది, సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరం అనంతరం ఏఎస్‌ఐ మాట్లాడుతూ.. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని వీటి పట్ల అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. తల్లి తండ్రులు తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. లోన్ ఆప్ ల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు ఎక్కువయ్యాయన్నారు. విశృంకల పాశావికమైన ఆలోచనల విధానాల వలన ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని, వీటి కట్టడికి చట్టాల ద్వారానే కాక మానవుల మనస్సుల్లో మార్పు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరీ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి, ఆదిత్య హాస్పిటల్ వైద్య సిబ్బంది, ముల్కనూర్ పోలీసులు పాల్గొన్నారు.IMG-20250524-WA0251

Also Read:  Bheemadevarapally, Mulkanoor: మంత్రి రాకతో అధికారుల హడావిడి..

Views: 8
Tags:

About The Author

Latest News