Bheemadevarapally, Mulkanoor: శ్రీకృష్ణదేవరాయ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

On
Bheemadevarapally, Mulkanoor: శ్రీకృష్ణదేవరాయ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

27 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక 

శ్రీకృష్ణదేవరాయ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

27 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక 

భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్: 

మండలంలోని ముల్కనూరు లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ ఉన్నత పాఠశాలలో పదవతరగతి (1997-98) చదువుకున్న రోజుల్లో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తప్పు చేస్తే దండించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో మంచి బుక్కు కొనుక్కో అంటూ తమను క్రమశిక్షణకు మారుపేరుగా మార్చిన ప్రతి గురువుకు పేరు పేరునా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తరగతి గదుల్లో ఆడిన ఆటలు, పాటలు, ఆకతాయితనంతో చేసిన చిలిపి చేష్టలను గూర్చి సరదాగా మాట్లాడుకున్నారు. ఇక్కడనే పుట్టి ఎక్కడెక్కడో స్థిరపడిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కష్టం వస్తే తోబుట్టువులుగా మేము ఉన్నామని చిన్ననాటి స్నేహితురాల్లకు భరోసా ఇచ్చారు. మీ ఇంట్లో పండుగలు జరిగితే పిలవకున్న పరవాలేదు కానీ కష్టం వస్తే అన్నయ్య అని పిలవండి అండగా నిలబడతాం అంటూ ఒకరినొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. బరువెక్కిన హృదయాలతో చిన్ననాటి స్నేహితులు నిష్క్రమించారు. ఈ కార్యక్రమంలో ప్రధానచార్యులు గూడ విశ్వవసు కోటేశ్వరరావు,ఆచార్యులు గూడ వీరభద్రం, రేణుక, అజ్గర్ అలీ, నీలం సంపత్, కాలేరు రాజన్న, రాజయ్య గౌడ్, మాధవి మధుసుధన్, మహిపాల్ రెడ్డి, అశోక్, విద్యార్థులు గుర్రాల రాజేష్, ఈరళ్ల కుమారస్వామి, పోతుగంటి తుకారం, గనబోయిన రాజు, దార్న గణేష్, కొండ వెంకటేశ్వర్లు, దొంగల వేణు, కాసగోని శ్రీకాంత్, పిన్నింటి రణధీర్ రెడ్డి, అలుగు రమేష్, వీణ, స్రవంతి, భాగ్యలక్ష్మి, రాధిక, సరిత పాల్గొన్నారు.

Also Read:  Maganti Gopinath: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత 

Views: 424
Tags:

About The Author

Latest News