Bheemadevarapally, Mulkanoor: నిస్సహాయులకు ఆపన్న హస్తం గా "మన ముల్కనూర్" వాట్సప్ గ్రూప్

On
Bheemadevarapally, Mulkanoor: నిస్సహాయులకు ఆపన్న హస్తం గా

సామాజిక మాధ్యమం. సేవా ఉద్యమం 

నిస్సహాయులకు ఆపన్న హస్తం గా "మన ముల్కనూర్" వాట్సప్ గ్రూప్

సామాజిక మాధ్యమం.. సేవా ఉద్యమం 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

Also Read:  Bheemadevarapally, Kothaplly: ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లి పురుషుల పొదుపు సంఘం

ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు(Social Media ) సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో "మన ముల్కనూర్ " వాట్సప్ గ్రూప్ (Mana Mulkanoor Whatsapp Group) వేదికగా నిస్సహాయులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, యువత, అనేకమంది ఈ వాట్సప్ గ్రూప్లో ఉంటున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలను గ్రూపులో పోస్టులు చేసి చేయూత అందిస్తున్నారు. "మన ముల్కనూర్" వాట్సాప్ గ్రూప్ 2018 సెప్టెంబర్ 26 న 50 మందితో  మోర రణధీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం 1024 మందికి చేరుకుంది. గ్రామంలో అనారోగ్య కారణంగా మృతి చెందిన పేద కుటుంబాలకు ఈ గ్రూపు ద్వారా విరాళాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉండే సమస్యలను ఈ గ్రూపు ద్వారా తెలియపరిస్తే పరిష్కారం కూడా అవుతున్నాయి. మన ముల్కనూర్ గ్రూప్ సభ్యులు సామాజిక మాధ్యమాలను సేవా ఉద్యమాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది.

Also Read:  Bheemadevarapally: అవగాహనతోనే కుష్టు వ్యాధి నివారణ

Views: 104
Tags:

About The Author

Latest News