Muddhiraala: 42 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

1983 - 84 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

On
Muddhiraala: 42 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికను అందజేసిన విద్యార్థులు

42 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక 

-1983 - 84 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

-ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికను అందజేసిన విద్యార్థులు 

మద్దిరాల, రాజముద్ర డెస్క్: 

సూర్యాపేట(Suryapet) జిల్లా, మద్దిరాల(Muddhiraala)మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో(ZPHS) 1983-1984 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (Reunion) శనివారం మద్దిరాల మండల కేంద్రంలోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్లో ( S. S Function Hall) నిర్వహించారు. 42 ఏళ్ల తరువాత ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను(Teachers )ఘనంగా సన్మానించి పూల మాలలు వేసి జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఫోటోలు దిగి మధుర స్ర్ముతులను నెమరువేసుకున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో  విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.  పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ సరదాగా గడిపారు. దాదాపు 40 ఏళ్ల(40 Years) తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. విద్యార్ధినీ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ విద్యార్ధి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టం వస్తే తోబుట్టువులుగా మేము ఉన్నామని చిన్ననాటి స్నేహితురాల్లకు భరోసా ఇచ్చారు. మీ ఇంట్లో పండుగలు జరిగితే పిలవకున్న పరవాలేదు కానీ కష్టం వస్తే అన్నయ్య అని పిలవండి అండగా నిలబడతాం అంటూ ఒకరినొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. బరువెక్కిన హృదయాలతో చిన్ననాటి స్నేహితులు నిష్క్రమించారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇంద్రసేనా రెడ్డి, సోమయ్య, జయప్రకాష్, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్, వనమాల నాగేశ్వర్ రావు, షేక్ షబ్బీర్, శేరి కరుణాకర్ రెడ్డి, ఎం డి. యూసుఫ్, ఆకుల మల్లయ్య, మామిడి వెంకన్న, వెంకటేశ్వర్లు, లింగమూర్తి, శ్రీరంగనాయకీ, వి. జ్యోతి, ఎస్. నాగమణి, బి. లీలావతి, కే. శోభారాణి తదితర మిత్రులు పాల్గొన్నారు.

Also Read:  Maganti Gopinath: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత 

Views: 79
Tags:

About The Author

Latest News