Bheemadevarapally, Mulkanoor: బిఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం 

నాలుగు రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

On
Bheemadevarapally, Mulkanoor: బిఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం 

నెలలో పది రోజులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు 

బిఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం 

నాలుగు రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

నెలలో పది రోజులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు 

 భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలంలో గత 4 రోజులుగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. 4 రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌, ఇంటర్నెట్‌ సేవలు సక్రమంగా అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపై ఆధారపడే వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. నెలలో పది రోజులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో సమస్యలు ఏర్పడినా బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది కనీసం స్పందించకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏండ్ల క్రితమే ముల్కనూర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం మూత పడడంతో వినియోగదారులు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా సంస్థ ఉన్నతాధికారులు స్పందించి అంతరాయం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ

Views: 163
Tags:

About The Author

Latest News