Bheemadevarapally: మండల ప్రజల మన్ననలు పొందిన ఎస్సై సాయిబాబు బదిలీ
On

బదిలీపై రానున్న నూతన ఎస్సై రాజు
మండల ప్రజల మన్ననలు పొందిన ఎస్సై సాయిబాబు బదిలీ
బదిలీపై రానున్న నూతన ఎస్సై రాజు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్ఐ లను బదిలీ చేస్తూ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ముల్కనూర్ ఎస్సై నండ్రు సాయిబాబు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యారు. గీసుకొండలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై రాజు ముల్కనూర్ ఎస్ హెచ్ ఓ గా వస్తున్నారు. ఎస్సై సాయిబాబు మండలంలో గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వర్తించారు. విధుల్లో భాగంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, గంజాయి పై ఉక్కు పాదం మోపి, యువతకు మార్గదర్శిగా నిలిచారని మండల ప్రజలు కొనియాడారు. ఎక్కడ విధులు నిర్వహించిన ప్రజల మన్నలను పొంది,ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కాగా బదిలీపై వెళ్తున్న ఎస్సై సాయిబాబు ను పలువురు కల్సి, వీడ్కోలు పలికారు.
Views: 598
Tags:
About The Author
Related Posts
Latest News
26 Aug 2025 17:35:06
ముల్కనూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి