Bheemadevarapally, Mulkanoor: ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎంటిపీ కిట్లు అమ్మితే కఠిన చర్యలు

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎంటిపీ కిట్లు అమ్మితే కఠిన చర్యలు
-డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్ :
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ లో పలు మెడికల్ షాప్ లను డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం నాడు తనిఖీ చేశారు. మెడికల్ షాప్స్ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ 1940 ప్రకారం సదురు మెడికల్ షాపులు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీలు చేశారు. దాదాపు 6 మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఎంటిపి కిట్లు ( అబార్టీ ఫేషియెంట్ టాబ్లెట్లు) అనధికార విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకం, హెచ్, హెచ్ 1 షెడ్యూల్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, ఈ ఉల్లంఘనలపై సంబంధిత మెడికల్ షాప్ లపై కేసులు నమోదు చేశారు. ఎంటిపీ కిట్ల విక్రయంలో డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం 1940, 1945 ను ఉల్లంఘించే ఫార్మసీలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.