Elkathurthi: వాహనాల సూచిక బోర్డు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఏఎస్సై సంపత్

కటకం సంపత్ ను అభినందించిన వాహనదారులు
వాహనాల సూచిక బోర్డు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఏఎస్సై సంపత్
కటకం సంపత్ ను అభినందించిన వాహనదారులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
వరంగల్-కరీంనగర్-సిద్ధిపేట మూడు జిల్లాలను కలిపే ఎల్కతుర్తి ప్రధాన కూడలిని ఇటీవల ఆధునీకరించారు. సుమారుగా 3.3 కోట్ల కుడా (కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ) నిధులతో, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో సుందరంగా తీర్చిదిద్దారు. అయితే సంబంధిత అధికారులు ఇప్పటివరకు అక్కడ లైటింగ్ సిష్టంకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో పాటు సిద్ధిపేట-కరీంనగర్- వరంగలకు వెళ్లే దారుల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. దీంతో పగలు, రాత్రి వేళల్లో వచ్చే వాహనదారులు ఎటూ వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి తప్పి కొంత దూరం వెళ్లాక ప్రయాణీకులను అడిగి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.దీంతో ఈ విషయం గ్రహించిన రిటైర్డ్ ఏఎస్సై కటకం సంపత్ తన వంతు కర్తవ్యంగా అక్కడే గతంలో పక్కకు పడేసి ఉంచిన సూచిక బోర్డులను తీసుకొచ్చి అక్కడ అమర్చారు. ఆర్అంబీ, 'కుడా' అధికారులు చేయాల్సిన పనిని రిటైర్డ్ ఏఎస్సై చేయడం పట్ల వాహనదారులు ఆయనను అభినందిస్తున్నారు.