Bheemadevarapally, Mulkanoor : టీబి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

ముల్కనూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి
టీబి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న టీబి వ్యాధిగ్రస్తులకు మంగళవారం నాడు వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి పోషక ఆహార కిట్లు అందజేశారు. హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ హిమబిందు చొరవతో, జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషక ఆహార కిట్లు పంపిణీ చేశారు. పోషకాహార కిట్టులో వంట నూనె , గోధుమపిండి, ప్రోటీన్ పౌడర్, బిస్కెట్లు, నెయ్యి, కోడిగుడ్లు, ఉన్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులు ప్రతీ రోజు చికిత్సతో పాటుగా ఈ అదనపు పోషకాహార కిట్టును వినియోగించుకుని వ్యాధి నుంచి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ మల్లీశ్వరి, ఫార్మసీ ఆఫీసర్ జ్యోతి, సూపర్వైజర్స్ రాజయ్య, రత్న భారతి , రాజు, సురేందర్జీ, మహేందర్, సిస్టర్స్ వనజ, సత్యవేద లు పాల్గొన్నారు.